
ఈ69న్యూస్ వరంగల్
వరంగల్ దేశాయిపేట లక్ష్మి టౌన్షిప్లో నిర్మించిన డబుల్ బెడ్రూంలను అర్హులైన జర్నలిస్టులకు వెంటనే కేటాయించాలని కోరుతూ జర్నలిస్టులు చేపట్టిన నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరింది. వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర,జిల్లాస్థాయి నాయకులు పులి శరత్ కుమార్,తాడూరి కరుణాకర్,ప్రమోద్ కుమార్లు దీక్షకు సంఘీభావం తెలిపారు.కేంద్ర నిధులతో నిర్మించిన ఇళ్లను వెంటనే జర్నలిస్టులకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.పలువురు జర్నలిస్టులు,సంఘ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించారు