
మండలంలోని రత్నవరం గ్రామానికి చెందిన కాసాని శ్రీనివాసరావు పద్మ దంపతుల కుమారుడు కాసాని యశ్వంత్ గౌడ్ ఇటీవల కాలంలో డాక్టర్ చదువు పూర్తి చేసుకొని గ్రామానికి విచ్చేసిన సందర్భంగా విద్యార్థికి జి ఎన్ సి విక్టరీ ఫౌండేషన్ చైర్మన్ వెంకట్ గౌడ్ శాలువాతోఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో చదువుకునే యువత యశ్వంతును రోల్ మోడల్ గా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. భవిష్యత్తులో మంచి డాక్టర్ గా సేవలందించి పేరు ప్రఖ్యాతులు సంపాదించి గ్రామానికి మంచి పేరు తేవాలని యశ్వంత్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంచార్జ్ నందిగామ రామారావు సభ్యులు సీతారాములు గౌడ్, పోలంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, ఏజికల్, యరగాని లింగయ్య, వీరబాబు, మిర్యాల గురుస్వామి, సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.