
** *కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలి* *సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్* సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు తెలంగాణ నాల్గవ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 21 22 23 తేదీలలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరగబోతున్నాయి అందుకు సంబంధించిన పోస్టర్లను ఆదివారము హనుమకొండ లోని సుందరయ్య భవన్లో విడుదల చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమాల్ని రూపొందించడం కోసం రాష్ట్ర మహాసభలు వేదిక కానున్నాయని తెలిపారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల కాలంలో కార్మికుల హక్కులను హరిస్తూ కార్మిక చట్టాలను మారుస్తూ దేశ సంపదను కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతూ దేశ ప్రజానీకాన్ని కార్మిక వర్గాన్ని మోసం చేస్తుందని ఆయన విమర్శించారు 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా యాజమాన్యాలకు అనుకూలంగా మార్చి కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేశారని ఆయన విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బొగ్గు ఓఎన్జిసి ఎయిర్ లైన్స్ విశాఖ ఉక్కు డిఫెన్స్ తదితర రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని రమేష్ పిలుపునిచ్చారు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయింది ఈ 8 సంవత్సరాలలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏ ఒక్కరిని కూడా పర్మినెంట్ చేయకపోవడం శోచనీయమని ఇచ్చిన హామీని కెసిఆర్ నిలుపుకోవాలని ఆయన డిమాండ్ చేశారు 73 షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క వేతనాలజీవోలను ఇప్పటివరకు సవరించలేదని తక్షణమే సవరించి గేజిట్ ను విడుదల చేసి కార్మికుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు డిసెంబర్ 23వ తేదీన వేలాదిమంది కార్మికులతో కార్మిక మహా ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని దానిని జయప్రదం చేయాలని రాగుల రమేష్ జిల్లా కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు టి ఉప్పలయ్య ఉపాధ్యక్షులు మెట్టు రవి బొల్లారపు సంపత్ బరుపట్ల మహేష్ యాస బాబు రాజు లు పాల్గొన్నారు