తరిగొప్పుల: డిసెంబర్ 21 22 23వ తేదీలలో సిద్ధిపేటలో జరిగే సిఐటియు నాలుగవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు కోరారుతరిగొప్పుల మండల కేంద్రంలో సిఐటియు సమావేశం పాండ్యాల అంజయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చించడం కోసం రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని విమర్శించారు పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు పెంచడం లేదని సంక్షేమ పట్ల ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు సిద్దిపేటలో జరిగే రాష్ట్ర మహాసభల బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్మికులు తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శిభూక్య చందు నాయక్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అపరాధపు రాజు సిఐటియు మండల నాయకులు ఎర్రవెల్లి నరేష్ యాటెల్లి శ్రీనివాస్ చింతల బుచ్చయ్య మేక కోటి ఖాతా యోహాన్ మర్రి రవి ఆసరి కుమార్ రాజా వేణి శ్రీను కూకట్ల కిష్టయ్య చామంతుల సంపత్ చింతల రాజు కలకుంట్ల పరశురాములు ఎడ్ల యాదగిరి ఆసరి ప్రశాంత్ సుంకరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు