*_ఆదివాసీల ఆస్తిత్వ పోరుగర్జన బహిరంగ సభకు భారీగా తరలి వచ్చి సభను
విజయ వంతం చేయాలని
తుడుం దెబ్బ పిలుపు
ఇచ్చోడ : డిసెంబర్ 9న ఇంద్రవెల్లిలో ఆదివాసీల ఆస్తిత్వ పోరుగర్జన బహిరంగ సభకు ఆదివాసీలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు గోడం గణేష్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పీసా, 1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జీవో 3ను యధావిధంగా అమలు చేసి ఐదవ షెడ్యూలు ప్రాంతంలో ప్రభుత్వం 29 శాఖల్లో ఉన్న ఖాళీలను ఆదివాసీలతో భర్తీ చేయాలన్నారు. జిల్లాలో ఆదివాసీ గిరిజన యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలని కోరారు. మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలంలోని దేవాపూర్  ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్ధానిక ఆదివాసీలు భూములు కోల్పోయారని , వారికి ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. అర్హులైన ఆదివాసీలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. స్పెషల్ డి. ఎస్. సి. వేసి ఆదివాసీ యువతీ, యువకుల చేతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దళితబంధు మాదిరిగా ఆదివాసీ బందును ప్రకటించి ఆర్ధికంగా ఆదివాసీలను ఆదుకోవాలన్నారు. భారీ వర్షాల మూలంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. జిల్లా, మండల కేంద్రాలలో నివసిస్తున్న ఆదివాసులకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు
డిసెంబరు 9,న, ఇంద్ర వెళ్లి లో
నిర్వహించే ఆదివాసిల అస్థిత్వ పోరు గర్జన సభకు కార్మిక కర్షక వర్గాల ప్రజలు మేధావులు ప్రజలు మహిళలు ప్రజాస్వామ్యవాదులు బుద్ధి జీవులు వేలాది గా తరలివచ్చి ఆదివాసీల అష్టిత్వ పోరాట గర్జన సభను విజయవంతం చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు _
కొడప నగేష్ రాష్ట కార్యదర్శి
ఆత్రం మహేందర్
మండల అధ్యక్షులు ఇచ్చోడ
కుంరా యాదవ్ రావు
సిరికొండ అధ్యక్షులు
సిడం మురళి కృష్ణ
కొట్నాక్ జంగూ
సిడం సునీల్
మడవి భీమ్ రావు
తొడసం భీమ్ రావు
గేడం నాగేందర్
పుల్లెడు భీముడు
చహకటి జగపతి
మరియు ఆయా గ్రామాల ప్రజలు
తదితరులు పాల్గొన్నారు_