
త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. గురువారం నాడు ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేశారు. గుగులోత్.పార్వతి రమేష్ నాయక్, బహుజన బిడ్డ అయినా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశీస్సులతో డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలుపుతూ నామినేషన్ వేయడం జరిగిందన్నారు, నామినేషన్ వేయడానికి భారీ ఎత్తున ర్యాలీగా డప్పు చప్పుళ్ళు తో, నామినేషన్ వేయడానికి రావడం జరిగింది అన్నారు, గురువారం మరిపెడ మండలం కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బహుజన సమాజ్వాద్ పార్టీ తరఫున గుగులోతు పార్వతీ రమేష్ నాయక్, ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసినట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నరసింహారావు తెలిపారు. పార్వతి రమేష్ నాయక్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గo లో గెలిచేది సమాజ్వాది పార్టీ మాత్రమేనని బహుజనులకు అండగా ఉండేది సమాజ్వాది పార్టీ మాత్రమే అన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దార్ల శివ రాజ్, జిల్లా ఇంచార్జీ విజయ్ కాంత్,జిల్లా ఉపాధ్యక్షులు తగరం నాగన్న, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జీ ఐనాల పరశురాములు,డోర్నకల్ అసెంబ్లీ మహిళా కన్వీనర్ సువార్త,అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు.