డోర్నకల్ నియోజకవర్గ లో గెలిచేది గులాబీ జెండానే
కారు గుర్తుపై ఓటేసి కేసిఆర్ చేసిన సంక్షేమ పథకాలకు మద్దతుగా నిలవండి మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే డోర్నకల్ ఎమ్మెల్యే గా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo కురవి మండల కేంద్రంలో ని పలు ప్రాంతాల్లో తట్టుపల్లి, మోదుగుల గూడెం,బెగావత్ తండ,జుజ్జూర్ తండా గ్రామ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డిఎస్ రెడ్యా నాయక్.కారు గుర్తుపై ఓటేసి కేసిఆర్ సంక్షేమ పథకాలకు మద్దతుగా నిలవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డిఎస్ రెడ్యా నాయక్ కోరారు.జడ్పిటిసి బండి వెంకట్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్ లో కారు గుర్తుపై ఓటేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ నే అని డోర్నకల్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ఓటర్లను ఆయన కోరారు, మనం పక్కా లోకల్,ఏ ఆపద వచ్చినా నేను మీ వెన్నంటే ఉంటా ఎక్కడో తెలియని వారిని గెలిపిస్తే వారి దగ్గరికి పోవడానికి ఒక రోజు పడుతుంది అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు,కురవి మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నామన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, రైతన్నలకు ఉచిత విద్యుత్తు, ఆడపిల్ల పుడితే 13000 మగ పిల్లగాడు పుడితే 12000 రూపాయలు కానుకగా ఇచ్చే ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు, కెసిఆర్ కిట్టు,ఉచిత వైద్యం గత పది సంవత్సరాల నుంచి ఎన లేని పథక ల తో దూసుకెళ్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు, పది సంవత్సరాలకు ముందు ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రాన్ని ఏమి చేయలేకపోయాయని,మనం పది సంవత్సరాలకు వాళ్లు చేయని అభివృద్ధి మనం చేసి చూపించామన్నారు,ఎన్నో సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కురవి జడ్పిటిసి బండి వెంకటరెడ్డి,ఎంపీపీ పద్మ రవి నాయక్,మహబూబాబాద్ మాజీ మార్కెట్ చైర్మన్ పిచ్చి రెడ్డి,కురవి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తోట లాలయ్య, సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ ఎర్రంరెడ్డి.సుధాకర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.