
డోర్నకల్ నియోజక అభివృద్ధికి 115 కోట్ల నిధులు మంజూరు
మానుకోట జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల నిమిత్తం 115 కోట్ల నిధులు మంజూరు అయినట్లు డోర్నకల్ శాసన సభ్యుడు ధరంసోత్ రెడ్యానాయక్ తెలిపారు.శనివారం మరిపెడ ఆర్ అండ్ బీ విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావుతో కలసి ఆయన మాట్లాడారు. ఈ నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి పలు అభివృద్ధి పనులను మంజూరీ కోరగా,వాటి అనుమతుల జీవోలు ఇచ్చారని తెలిపారు. మరిపెడ లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి 36 కోట్లు,నియోజక వర్గంలో లింక్ రోడ్ల నిర్మాణానికి 37.25 కోట్లు, ఉలేపల్లి గ్రామంలో ఆకేరు వాగు పై వారధి నిర్మాణానికి 15 కోట్లు,గ్రామాల్లోని సీసీ రోడ్ల నిర్మాణానికి 10 కోట్లు, రాం పురం నుండి కొత్తూరు రోడ్డు,కురవి నుండి మోగిలిచర్ల రోడ్డు నిర్మాణానికి 14 కోట్లు మొత్తం 115 కోట్లు మంజూరీ అయ్యాయని డోర్నకల్ ఎమ్మేల్యే రెడ్యానాయక్ వివరించారు. డోర్నకల్ అభివృద్ధికి సహకరించిన సీఎం కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అతి త్వరలోనే ఈ పనులకు రాష్ట్ర మంత్రి వర్యులు హరీష్ రావుతో శంకుస్థాపనలు ఉంటాయన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోతు సింధూర కుమారి,ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు, జెడ్పీటీసీ తేజావత్ శారద రవీందర్, రామడగు అచ్చుత రావు, మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న, ఎండీ ఆయుబ్ పాషా, నారెడ్డి సుదర్శన్ రెడ్డి,కేసముద్రం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంట్ల మహిపాల్ రెడ్డి,గందశిరి కృష్ణ,దుస్సా నర్సయ్య తదితరులు పాల్గొన్నారు