ఈ69న్యూస్ న్యూస్ వరంగల్,జూలై 17:-వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేడు డ్రంకెన్ అండ్ డ్రైవింగ్ కేసులో పట్టుబడిన 22 మంది వ్యక్తులను మేజిస్ట్రేట్ అబ్బోజు వేంకటేశం ఎదుట హాజరుపరిచారు.ఈ తనిఖీలు వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ ఐపిఎస్ మరియు ఎసిపి టి.సత్యనారాయణ పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో నేరస్థులుగా కనిపించిన ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు.శిక్ష పడిన వారు:-1.పఠాన్ హుస్సేన్ (27)డ్రైవర్,అర్వపల్లి,హసన్పర్తి,2.వదనల శ్రీనివాసరావు (40) కూలీ,టీచర్స్ కాలనీ,హన్మకొండ,3.బానోత్ దేవేందర్ (35) డ్రైవర్,పాపయ్యపల్లి,ములుగు.వీరి ముగ్గురిని హుజురాబాద్ సబ్ జైలుకు తరలించారు.అలాగే మిగతా 19 మంది నిందితులకు కలిపి రూ.20,600/-జరిమానా విధించారు.అంతేకాకుండా,డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన నలుగురికి రూ.2,000/-చొప్పున జరిమానా విధించారని వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ వెల్లడించారు.ఇలాంటి తనిఖీలు వరుసగా కొనసాగుతాయని,మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన శిక్షలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.ప్రజల భద్రతే తమ ముఖ్య లక్ష్యమని సిఐ రామకృష్ణ తెలిపారు.