
తమ్మడపల్లి (జి) గ్రామ BRS పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం
జాఫర్ గడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలో మాజీ మార్కెట్ చైర్మన్ జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు అన్నం బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థాయి బి.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లలో బి.ఆర్.ఎస్ పార్టీ బలపరిచే అభ్యర్థికి అత్యధిక ఓట్లను తీసుకువచ్చే విధంగా కష్టపడి పని చేయాలని,మండలంలోనే (జి) తమ్మడపల్లి గ్రామంలో అత్యధిక మెజారిటీని మన పార్టీ అభ్యర్థికి వచ్చేలా చూడాలని పార్టీ సూచించే ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు అందరూ చురుగ్గా పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని కార్యకర్తలందరూ విజయవంతం చేయాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అన్నెపు పద్మ అశోక్ ,ఎం.పీ.టీ.సీల ఫోరం మండల అధ్యక్షులు చిలువేరు శివయ్య ,మాజీ సర్పంచ్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారేపల్లి ప్రభాకర్ మరియు గ్రామంలోని బి.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.