జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలోని తమ్మడపల్లి-జి పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఎంపీడీఓ సుమన్ శాలువాలతో సత్కరించారు.చిలువేరు మౌనశ్రీ 567 మార్కులతో ద్వితీయ ర్యాంకు,సముద్రాల తేజస్విని 559 మార్కులతో మెరుగైన ఫలితాలు సాధించారు. కార్యక్రమంలో కరాటే శిక్షణ శిబిరాన్ని కూడా ఎంపీడీఓ ప్రారంభించారు.