
telugu galam news e69news local news daily news today news
-స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు
గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్
బిఆర్ఎస్ పార్టీలో చెల్లని రూపాయి కాంగ్రెస్ పార్టీలో ఎలా చెల్లుతాడు అని డాక్టర్ రాజయ్యను ఉద్దేశించి స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా నాయకుల జగదీశ్ చందర్ రెడ్డి,రఘునాథపల్లి ఎంపీపీ మేకల వరలక్ష్మి,స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షుడు శిరీష్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య,చిల్పూర్ మండల అధ్యక్షుడు గడ్డమీది సురేష్ లు పాల్గొని మాట్లాడారు..మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గతంలో రెండుసార్లు ఓడిపోయినప్పటికీ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక దళిత బిడ్డగా ఒక డాక్టర్ గా అతనిని గుర్తించి డాక్టర్ టికెట్ ఇవ్వడం జరిగిందని,గెలిచిన రెండు సంవత్సరాలకే పార్టీని కాంగ్రెస్ నాయకులను మధ్యలో వదిలేసి సొంత రాజకీయ మనుగడ కోసం టిఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన తరవాత అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ,రాసలీల రాజయ్య అని పేరు తెచ్చుకొని,చివరికి బిఆర్ఎస్ పార్టీలో ఉనికిని కోల్పోయి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్పడం అతిశయోక్తి అని అన్నారు.దళిత బందులొ మరియు గొర్ల కొనుగోలు స్కీములో డబ్బులు దోచుకుని,వారందరూ మా డబ్బులు మాకు ఇవ్వాలి అని ఒత్తిడిలు చేయగా ఈరోజు దాని నుండి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని అంటే మేము ఎలా ఊరుకుంటామని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి సింగపురం ఇందిరా ఓటమికి కారణమైన రాజయ్య,గత పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించాడని,ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను అని అంటే ఎలా ఊరుకుంటామని అన్నారు.రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మళ్లీ గ్రూపు రాజకీయాలు అవుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ఇంచార్జ్ నగరబోయిన శ్రీరాములు,పట్టణ అధ్యక్షులు నీల శ్రీధర్,మండల నాయకులు కాసాని బొందయ్య, మండల ప్రధాన కార్యదర్శి నారగోనీ పద్మ,అన్నెపు బిక్షపతి,నస్కల్ ఎంపిటిసి శిరీష సురేష్,ఐలపాక భూషణ్,పాశం ప్రకాష్,పాశం ప్రవీణ్,మారపాక వసంత్,మర్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు.