మెరుగైన వైద్యం కోసం ఖమ్మం హాస్పిటల్ కి తరలింపు తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది.వివరాలు పరిశీలిస్తే
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన కాసాని గురుమూర్తి(46) ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుంచి పడటంతో అతని కాలు,చేయి,విరగడం తో పాటు తీవ్ర గాయాలు కావడం తో హుటాహుటిన 108 లో ఖమ్మం హాస్పిటల్ కి తరలించారు.అతనికి భార్య, కుమారుడు,కుమార్తె ఉన్నారు.