తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి....
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి….
జనగామ :- తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గీత కార్మికులకు చనిపోయిన శాశ్వత వికలాంగులకు 10 లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణం ప్రభుత్వం ఏర్పాటైన నుండి నేటి వరకు తాటి ప్రమాదాలకు గురై మరణించిన శాశ్వత వికలాంగులైన బాధ్యత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇచ్చి హామీ నిలబెట్టుకోవాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి డిమాండ్ చేశారు.
ఈరోజు కల్లు గీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి చేర్యాల పట్టణ అధ్యక్షులు గుడాల గణేష్ పట్టణ కార్యదర్శి పర్చిమట్ల రాములు ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో చేర్యాల పట్టణంలో తాటి ప్రమాదానికి గురైన బురగోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది.వారి ఇంటి వద్ద దీన స్థితిని చూసి వారి వెంట వచ్చిన వారందరూ తీవ్రమైన ఆవేదనకు గురి కావడం జరిగింది.గత నెల 15వ తేదీన తాటి ప్రమాదానికి గురై తీవ్రమైన గాయాలయి పక్కటి ఎముకలు విరిగి ఊపిరితిత్తులకు గుచ్చుకొని అలాగే వెన్నుముక పూర్తిగా డ్యామేజ్ అయ్యి హైదరాబాదులోని నిమ్స్ హాస్పటల్లో వైద్యం చేయించుకుని ఆపరేషన్ పూర్తికాక చేతిలో డబ్బులు లేక దీనస్థితిలో మంచానికే పరిమితమై అవస్థ పడుతున్న వారిని చూసి పరామర్శించి ఆవేదన వ్యక్తం చేశారు.సందర్భంగా బూడిది గోపి మాట్లాడుతూ బురగోని శ్రీనివాస్ కు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఉండడానికి నిల్వ నీడ కూడా లేదని తక్షణం కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇంటి రుణం మంజూరు చేసి ప్రత్యేకమైన చొరవ తీసుకొని ప్రభుత్వమే పూర్తిగా నిర్మాణం చేసి ఇవ్వాలని అలాగే తక్షణం మెరుగైన వైద్యం అందించడం కోసం కృషి చేయాలని తక్షణం 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా అందించి బాధితుని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
దీనితోపాటు కల్లుగీత కార్మిక సంఘం సీనియర్ నాయకులు కూరెల్లి యాదగిరి కుమారుడు కూరెల్లి తిరుపతి కామెర్ల వ్యాధితో తీవ్రమైన లివర్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ చావు బతుకుల మధ్య ఉన్నాడు వారిని ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి వారి పిల్లల ఉన్నత చదువులకు అలాగే కుటుంబ పోషణకు పెద్దదిక్కు శ్రీనివాసు తీవ్ర అనారోగ్యంతో మరణించే పరిస్థితులు ఉన్నాయని అందుకోసం వారి కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సొసైటీ అధ్యక్షులు పచిమట్ల సిద్ధిరాములు సీనియర్ నాయకులు పచిమట్ల వెంకటయ్య గుడాల రాజయ్య పచ్చిమట్ల కృష్ణమూర్తి నేరెళ్ల నరేష్ బండి శ్రీనివాస్ పచ్చిమట్ల మహేందర్ బురగోని పెద్ద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.