
మునగాల మండల పరిధిలోని తాడువాయి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కోదాడ మాజీ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవరం సుధీర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జిల్లేపల్లి వెంకటేశ్వర్లు మునగాల మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీల్లేపల్లి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కల్మషం లేని మచ్చలేని మహా నాయకురాలు కోదాడ ప్రజలే తన పిల్లలుగా భావించే మంచి మనసున్న మహా నాయకురాలన్ని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు మచ్చ మంగతాయారు,జిల్లెపల్లి బాలకృష్ణ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవరం సుధీర్ రెడ్డి,జిల్లేపల్లి నెహ్రూ,భిక్షం ఆలేటి గురు ప్రసాద్,జెట్టి నాగేశ్వరరావు,జిల్లేపల్లి వినయ్, తదితరులు పాల్గొన్నారు.