
ఎమ్మెల్యే డా.రాజయ్య
సర్కారు బడులలో సకల వసతులు అదే మన ఊరు మనబడి ఉద్దేశం…ఎమ్మెల్యే డా.రాజయ్య
కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే మన ఊరు మనబడి ప్రోగ్రామ్ లక్ష్యం…ఎమ్మెల్యే డా.రాజయ్య
ఈరోజు…జాఫర్గడ్ మండలం , తీగారం గ్రామం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ద్వారా మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మండల ప్రజా పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాలలో మన ఊరు-మన బడి నిధులు(MOMB) మరియు ఎంజీఎన్ఆర్ఇజిఎస్ నిధుల నుండి రూ:16.60 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన మౌళిక వసతుల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రివర్యులు , ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని తీగారం ప్రాథమికొన్నత పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన వంటగదులు , ప్రహారీగోడ , పాఠశాల మరమ్మతులు , విద్యార్థులు & ఉపాధ్యాయుల కోసం కొనుగోలు చేసిన ఫర్నిచర్ , గ్రీన్ బోర్డులు మరియు టాయిలెట్స్ నిర్మాణాలు ను ఎమ్మెల్యే డా.రాజయ్య గారు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డా.రాజయ్య గారు ముఖ్య అతిథిగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఉధ్యేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…ఆచార్యదేవో భవ అంటే గురువు దేవుడితో సమానం.Education is Important to Among all(ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ టు ఏమాంగు ఆల్) అంటే విద్యా వజ్రాయుధం లాంటిదని ,చదువు సకల సమస్యలకు పరిష్కారమని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో 1001 రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించి ఒక్కో విద్యార్థి మీద 1.20 లక్షల ఖర్చు చేస్తూ విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఉచిత ఆంగ్లవిద్య అందిస్తున్నారని తెలిపారు
అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మన ఊరు-మన బడి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దాదాపు రూ. 7300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో ఉన్న 26065 ప్రభుత్వ పాఠశాలలను 12 అంశాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలు సెలెక్ట్ కావడం జరిగిందని తెలిపారు.మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా తీగారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ:16.60 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన మౌళిక వసతుల అభివృద్ధి పనులను ఒక పండుగ వాతావరణంలో లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని సర్కార్ బడులకు మహర్దశ పట్టనుందని ఎమ్మెల్యే గారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు అని ఎమ్మెల్యే గారు తెలిపారు అంటే 12 అంశాలలో ప్రభుత్వ పాఠశాలను మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా సమగ్ర అభివృద్ధి చేయనున్నారని తెలిపారు మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి అని తెలిపారు.
సర్కార్ బడులు సమూలంగా మార్పు చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నేరుగా బడ్జెట్లో నిధులు కేటాయించడం గొప్ప విషయం అని తెలిపారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి నేరుగా జరుగుతుందని తెలిపారు.
గతంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులను లేదా కలెక్టర్లను అడిగే పరిస్థితులు ఉండేవారమని తెలిపారు. కానీ మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నేరుగా బడ్జెట్లో నిధులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం తీసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన తోపాటు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు.దీంతో విద్య కోసం వలసలు తగ్గుతాయి ముఖ్యంగా బాలికల డ్రాపౌట్స్ తగ్గుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవ్వడానికి అదేవిధంగా అన్ని రకాల మౌళిక వసతుల కల్పనకు అవకాశం ఉందని తెలిపారు.
దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ణయించబడుతుందని , నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కావున ప్రభుత్వ పాఠశాలల్లో సమూలంగా మౌళిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి చేయడానికి మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధికి నాకు వచ్చిన ఐదు కోట్ల రూపాయలలో రెండున్నర కోట్లు నియోజకవర్గ అభివృద్ధికి అదేవిధంగా మరో రెండున్నర కోట్లు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని పాఠశాలల అభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు మానవతా దృక్పథంతో పని చేస్తూ సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పిల్లలు ఏదైనా సాధించడానికి టీచర్స్ ఇచ్చే సలహాలు , సూచనలు వారి మీద చాలా వరకు ఎంతో ప్రభావితం చేస్తాయని తెలిపారు.
సాధించాలనే కోరిక ఉండి అందుకు తగ్గట్టుగా ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి నిరీక్షణ పట్టుదల ఆత్మవిశ్వాసం అకుంఠిత దీక్షతో కష్టపడితే మనం మనం అనుకున్నది సాధించవచ్చు అని పాఠశాల విద్యార్థులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు , ముఖ్య నాయకులు , సంబంధిత శాఖల అధికారులు-ఉద్యోగులు , మహిళ నాయకులు , గ్రామప్రజలు , ఉపాధ్యాయులు , విద్యార్థులు , విద్యార్థుల తల్లిదండ్రులు మరియు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు…