
తుమ్మడం గ్రామం 9వ వార్డులో మురికినీటి సమస్య రోజురోజుకు ముదురుతోంది
నల్గొండ జిల్లా నిడమానూరు మండలంలోని తుమ్మడం గ్రామం 9వ వార్డులో మురికినీటి సమస్య రోజురోజుకు ముదురుతోంది. మురుక్కాలవ పూర్తిగా నిండిపోయి, మురికినీరు రోడ్డుపైకి వచ్చి ప్రవహిస్తోంది. ప్రజలు నిత్యజీవనంలో తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.ఇప్పటికే ఈ పరిస్థితి నెలలాగే కొనసాగుతున్నప్పటికీ, తుమ్మడం పంచాయతీ సెక్రటరీ లింగయ్య ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పుడు అయినా స్పందించి మురుక్కాలవను శుభ్రపరచి, మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వాధికారులు ఈ విషయాన్ని గమనించి వెంటనే స్పందించకపోతే, తుమ్మడం పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయాలని ప్రజలు కలెక్టర్‌ను కోరుతున్నారు.