తెలుగు గళం జఫర్ఘడ్ జనగామ జిల్లా జాఫర్ గడ్ మండలం వడ్డెగూడెం బీసీ కాలనిలో విద్యుత్ వైర్ తెగి కరెంట్ కు అంతరాయం కలగడంతో వెంటనే స్పందించి సకాలంలో కరెంట్ వచ్చేలా చేసిన స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రేస్ వైస్ ప్రెసిడెంట్ తాటికాయల రాజేందర్.జాఫర్ గడ్ వడ్డెగూడెంలో బిసి కాలానిలో గాలి దుమరానికి విద్యుత్ వైర్లు తెగడంతో కరెంట్ పోవడం జరిగింది.రాత్రి పూట కరెంట్ పోవడంతో వానకాలం కావడంతో ఇంట్లో చిన్న పిల్లలు పెద్దవాళ్లు దోమలతో ఇబ్బంది పడడంతో స్థానికులు తాటికాయల రాజేందర్ ని సంప్రదించగా వెంటనే స్పందించి సొంత ఖర్చులతో జేసీబీ తెప్పించి చెట్లను తొలగించి స్థానిక కరెంట్ ఆపరేటర్ చేరిపెల్లి కృష్ణను సంప్రంధించి విద్యుత్ వైర్లు రిపేర్ చేయించి విద్యుత్ వెలిగించడం జరిగింది.సకాలంలో స్పందించి కరెంట్ వచ్చేలా చేసినా తాటికాయల రాజేందర్ కి స్థానికులు కృతజ్ఞతలు తెలపారు.