
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలోని 652 సర్వేనెంబర్ లో సుమారు 150 ఎకరాల భూమి ఉన్నది.దానిలో సుమారు 4 ఎకరాల భూమిలో తెట్టకుంట ఉంటుంది.దాని కింద 40 కుటుంబాలు గత 50 సంవత్సరాలుగా భూమి సాగు చేసుకుంటున్నారు.ఈ కుంట ద్వారా ఒక పసల్ పండించుకొని జీవనం కొనసాగిస్తున్నారు.ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు కుంటను ధ్వంసం చేసి ఆక్రమించుకున్నారు.ధ్వంసం చేసిన వారిలో కుందూరు నరసింహారెడ్డి,బసిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారని బాదిత రైతులు ఆరోపిస్తున్నారు.వారిపైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా అధికారులు స్పందించి త్వరగా ఈ కట్ట కింద ఉన్న రైతులకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బొంకూరు మల్లయ్య,బొంకూరు మహేష్,బొంకూర్ యాదగిరి,పాల బిక్షపతి,కమలమ్మ గద్దల,గుండె లక్ష్మి,గుండె అనిల్,గుండే అశోక్,నామల మల్లా కి,బొంకూరు శ్రీనివాస్,బొంకురి బాబు,గద్దల జయరాజు,బొంకురి మల్లాకి,బైరపాక శ్రీనివాస్,భైరపాక నరసయ్య,మాచర్ల ఎల్లయ్య,మాచర్ల యాకోబు,దళిత రాజు,గుంటూరు ప్రశాంత్ పాల్గొన్నారు.