
తెలంగాణలోని మొట్టమొదటి బహుజన రాజు
చరిత్రపూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా, రఘనాథపల్లి మండలం, ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు నాసగోని ధర్మన్న డాక్టర్గౌడ్. చుట్టు పక్కల గ్రామస్తులు గౌరవంతో ధర్మన్నదొర అనేవారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. సర్వమ్మ అతడి తల్లి. అందరు అతన్ని పాపన్న గౌడ్అని పాపన్న దొర అన్ని పిలిచేవారు. పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు.పాపన్న గౌడ్ మొట్టమొదటి బహుజన వీరుడు బహుజన చక్రవర్తి బహుజన నాయకుడు అయినా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
ధూళిమిట్ట శాసనం ప్రకారం ఆగష్టు 18, 1650 నాడు పాపన్న గౌడ్ వరంగల్ జిల్లాలో గౌడ్ కులంలో జన్మించాడు. గౌడ చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తి ధూల్మిట్ట వీరగల్లు శాసనంలో ఇలా వుంది. ‘‘ బండిపోత గౌడ షాపూర్ ఖిలా పులి గౌడ యేబది రొడ్డి షబ్బారాయుడ, పౌదరు పాపన్న గౌడ్
బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్ధితులు గమనించేవాడు. తల్లి సర్వమ్మకు ఒక్క కొడుకు కావడంతో గారాబంగా పెంచింది. పాపన్న వంశం శైవమతస్థులై ( శివభక్తులు) (గౌడు కులం వారు అందరు కూడ) నిత్యం పూజలు సంప్రదాయాలను తరాలుగా వస్తున్న సంప్రదాయా జీవితాన్ని యుక్త వయసు వచ్చే నాటికి క్రమక్రమంగా వ్యతిరేకించాడు .
ఇతర కులాల వారితో తిరిగేవాడు . వీరిలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీరు సాహేబ్ పాపన్న ప్రధాన అనుచరులు .
తల్లి సర్వమ్మ కోరికతో తాటిచెట్లు ఎక్కి (కలాలి) కల్లు గీయడం కులం పని చేయడం స్నేహితులు, పాపయ్య కల్లు తాగడం లోకం తీరు చుట్టుప్రక్కల జరుగుచున్న విషయాల గురించి చర్చలు గంటల తరబడి మాట్లాడుకునేవారు
సైనికులు పాపన్న వద్ద కల్లు తాగి వెళ్లిపోవుటకు సిద్దం అవుచుండగా, కల్లు మండువాకు వస్తున పాపన్న స్నేహితుడు ఒకరు “ధనరాసులు ఉన్నా కల్లు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద సైనికులు వెళ్లిపోవుటకు సిద్దం అయ్యారా” అని సరసంగా అన్నాడు.
అందుకు తురుష్క సైనికుల్లో ఒకడు కోపంతో పాపన్న స్నేహితున్ని తన్నుటకు కాలు ఎత్తాడు. అది చూసి ఆ క్షణంలో కోపోద్రిక్తుడైన పాపన్న, తన వద్ద కల్లు గీయడానికి ఉపయోగించు గీత కత్తి, మారు కత్తిలో ఒకదానితో, ప్రాణ స్నేహితుణ్ణి తన్నుటకు కాలు ఎత్తిన సైనికుడి మెడ నరికాడు. దాంతో మిగాతా సైనికులు పాపన్న మీదికి యుద్దానికి రావడంతో, ఎంతో బలవంతుడైన పాపన్న వారిని కూడా అంతమొందించాడు
అప్పటి నుండి తురుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకొని వెళ్ళేదారిలో, పాపన్న అతని స్నేహితులతో కలసి తిరుగుబాట్లు ప్రారంభించాడు. అలా మొదలైన తిరుగుబాటుతో ఆయుధాలు, గుర్రాలు, డబ్బులు కూడా సమకూర్చుకున్నాడు.
బడుగువారి జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని, అధికారం కాని లేవు. గెరిల్ల సైన్యాన్ని తయారు చేసి, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసి, తన సొంత ఊరు ఖిలాషాపూర్ ని రాజధానిగా చేసుకొని, 1675 లో సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు.
పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడు
ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు 12 వేల సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండ కోటను స్వాధీనపర్చుకొని 7 నెలలపాటు అధికారం చెలాయించాడు
పాపన్న ముస్లిం మతానికి చెందిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె భువనగిరి కోట ఫౌజ్దార్ (మిలిటరీ గవర్నర్) సోదరి. భువనగిరి కోటను రాజధానిగా చేసుకొని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు.