
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు మరిపెడ మున్సిపాలిటీలో ని తొమ్మిదవ వార్డులో కున్యా తండాలో 200 పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఏడో వార్డులోని పూల బజార్లో 150 మంది , మరిపెడ లో 12వ వార్డులో ముదిరాజ్ సంఘానికి చెందిన 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేశారు. మండలంలోని వివిధ గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తూ లచ్చి తండా,బాల్య ధర్మారం,తండ ధర్మారం,పురుషోత్తమయి గూడెం,జర్పుల తండా, అబ్బాయిపాలెం,తదితర గ్రామాలలో ప్రచారం నిర్వహించారు, ప్రచార సభలలో డాక్టర్ సాబ్ మాట్లాడుతూ డిఎస్ రెడ్యా నాయక్ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో వెళ్లి కాంగ్రెస్ పార్టీపై నిందలు వేయడం సబబే నా అని విమర్శించారు. రెడ్యా నాయక్ రాజకీయ ఎదుగుదల కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగిందని విమర్శించారు. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం రెడ్యానాయక్ నిజస్వరూపం ఏందో ప్రజలు గమనిస్తున్నారని తెలియజేశారు. డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఈసారి భారీ మెజారిటీతో గెలిపించాలని మండలంలోని ప్రజలను కోరారు నేను మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ పార్టీ మనకు శ్రీరామరక్ష అని ఏ ఒక్క చిన్న కార్యకర్తను కూడా పోగొట్టుకోను అని కార్యకర్తలకు భరోసా కల్పించారు యువత ముందుండాలని ఉద్యోగాలు రాక చితికిపోయారని చదువుకున్న చదువుకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు,ఈ కార్యక్రమంలో మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు యుగంధర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ గందశిరి అంబరీష,కాలం రవీందర్ రెడ్డి, మరిపెడ టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్,జిల్లా కార్యదర్శి రవి నాయక్ జిల్లా నాయకులు పెండ్లి శ్రీనివాస్ రెడ్డి,గుండ గాని వేణు,గుండగాని వెంకన్న, మాజీ వార్డ్ మెంబర్ ఉమేష్, అశోక్, వెంకన్న, షానవాజ్, గుండగాని వేణు, మహమ్మద్ సుబాని, మహమ్మద్ హనీఫ్,షేక్. వలి షేక్.మన్సూర్ అలీ, మహమ్మద్ మహబూబ్, మహమ్మద్ ముక్తార్, షేక్ అక్బర్, సయ్యద్ గౌస్,షేక్.లతీఫ్, కనికిచర్ల పద్మ, తదితులు పాల్గొన్నారు