తెలంగాణా రాష్ట్ర రిసోర్స్ పర్సన్ గా చిదురాల శ్రీనివాస్
రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూరు లో నిర్వహించిన కెరియర్స్ ఇన్ వోకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్ప్రినర్షిప్ ముగింపు శిక్షణ కార్యక్రమంలో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ ప్రిన్సిపాల్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్న డాక్టర్ చిదురాల శ్రీనివాస్
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి ఉన్నత పాఠశాల కు చెందిన గణిత ఉపాధ్యాయుడు చిదురాల శ్రీనివాస్ ప్రాంతీయ విద్యా సంస్థ మైసూరు లో ఈనెల 6 నుండి 8 వరకు జరిగిన “కెరియర్స్ ఇన్ వోకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్ప్రినర్షిప్ ఫర్ స్కూల్ కౌన్సిలర్స్ “ అనే జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ ప్రద్యుమ్న కుమార్ శెట్టి చేతుల మీదుగా సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో వృత్తి విద్య మరియు ( ఎంటర్ప్రెన్యూర్షిప్) వ్యాపారాభివృద్ధి పట్ల మరింత స్పష్టతను మెలకువలను తెలుసు కోవడం జరిగింది. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, సృజనాత్మకత, మరియు ప్రొఫెషనల్ గైడెన్స్ మెరుగుదలకు ఈ శిక్షణ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లక్ష్యాలను పాఠశాల స్థాయిలో అమలు చేయడానికి ఇలాంటి శిక్షణలు ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా నిలుస్తాయి అని తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ నుండి ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీ సభ్యులు డా. సిహెచ్. భరణి కుమార్, రిసోర్స్ పర్సన్ లు డా. శ్రీధర్, డా. కందాల రామయ్య, అట్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో డా. దీపక్ ప్రధాన్, ప్రోగ్రామ్ డైరెక్టర్ మరియు జాయింట్ డైరెక్టర్, డా. సంగమేశ్వర, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. పరుల్ సింగ్ సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్సీఈఆర్టీ మరియు డా. ప్రపోల్ చంద్ర రిజిస్ట్రార్, చాణక్య యూనివర్సిటీ తదితరులు చిదురాల శ్రీనివాస్ ను అభినందించారు.