
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి
ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజక వర్గం లో నాయిని రాజేందర్ రెడ్డి గారు చేపట్టిన హత్ సే హత్ యాత్ర లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
మోసపూరిత కేసీఆర్ సర్కార్ – అమలుకు నోచుకోని బిఆర్ఎస్ ఎన్నికల హామీలు
అసంపూర్తిగా సాగునీటి ప్రాజెక్టులు, దోచి పెట్టిన కాళేశ్వరం
ప్రాజెక్టుల కోసం గుంజుకున్న రైతుల భూములకు పరిహారం ఇవ్వని బిఆర్ఎస్ కే.జి నుంచి పీజీ – ఉచిత విద్య అని చెప్పి మాట తప్పిన బీఆర్ఎస్
పోడు భూములకు పట్టాలిస్తామని పత్తా లేని బిఆర్ఎస్
దళిత, గిరిజనులకు కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామని ఊసేత్తని బిఆర్ఎస్
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ ఉష్ కాకీ
దళిత సీఎం, మూడెకరాల భూమి, కుటుంబానికి రూపాయలు 10. లక్షలు అంటూ దళితులను దగా చేసినా బిఆర్ఎస్ కేసీఆర్ రైతు రుణమాఫీ చేయకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాతలు
రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ పై రూ. 1.52 లక్షల అప్పు భారం.. కేసీఆర్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో 8 వేల మందికి పైగా రైతుల ఆత్మహత్యలు
కరెంట్, బస్, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచి ప్రజలను దోచుకుంటున్న బిఆర్ఎస్
ధనిక రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నిధుల లేమి, ఉద్యోగులకు జీతాలు లేవు. వారికి హామీ ఇచ్చిన సీపీఎస్ రద్దు చెయ్యలేదు… ఉద్యోగాల భర్తీ చేయకపోగా, ఇస్తామన్న రూ. 3016/- నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో ప్రతి నిరుద్యోగికి సుమారు లక్ష 40 వేల రూపాయలు బాకీ పడ్డ సర్కార్.. .
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అందని సహకారం
ధరణి పేరుతో రైతులకు దగా
భూములను చెరబట్టి, కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు.
బి.ఆర్.ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ పదాన్నే విస్మరించి తెలంగాణ ఆత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్
ఒడ్డుకు చేరి తెడ్డును కాల్చిన చందంగా కేసీఆర్ యవ్వారం
తల్లికి మట్టి గాజులు తేలేనోడు పిన్నమ్మకు బంగారు గాజులు తెలి అన్నట్టు ఉంది కేసీఆర్ వైఖరి తెలంగాణకు న్యాయం చేయనోడు దేశానికి ఏమి చేస్తాడో ఆలోచించాలి అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సీతక్క గారు అన్నారు