
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను తప్పక అమలు చేస్తుంది..
– 18వ రోజు రేగొండ మండలంలో కొనసాగిన గండ్ర సత్యనారాయణ రావు ప్రజా దీవెన యాత్ర..
– యాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు..
– మంగళ హారతులు ఇచ్చి, బంతిపూలు చల్లి, కోలాటాలతో ఘన స్వాగతం పలికిన మహిళలు..
– బాగిర్తి పేట క్రాస్ రోడ్డు, బాగిర్తి పేట, దుంపిల్లపల్లి, గూడెపల్లి గ్రామాలలో సాగిన ప్రజా దీవెన యాత్ర కార్నర్ మీటింగ్లో మాట్లాడిన గండ్ర సత్యనారాయణ రావు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా ఒక్కసారి అవకాశం ఇచ్చి, సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గండ్ర సత్యనారాయణ రావు గారు చేపట్టిన ప్రజా దీవెనయాత్ర నేటితో 18వ రోజు చేరుకుంది. ఈరోజు ఉదయం నుండి బాగిర్తి పేట క్రాస్ రోడ్డు, బాగిర్తి పేట, దుంపిల్లపల్లి, గూడెపల్లి గ్రామాలల్లో యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో అన్ని గ్రామాలలో ప్రజలు, మహిళలు మంగళ హారతులు ఇచ్చి, బంతిపూలు చల్లి, కోలాటాలతో స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జీఎస్సార్ ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో రూపొందించిన కరపత్రాన్ని ప్రజలకు అందించారు.
అనంతరం ఆయా గ్రామాలలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. మనకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా ఒక్కసారి ఓటు వేసి, అధికారాన్ని ఇచ్చి, సోనియమ్మ రుణం తీర్చుకోవాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ఎద్దేవా చేశారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన నియోజకవర్గంలోని చాలా గ్రామాలలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందన్నారు. బాధిత ప్రజలను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ కు తీరిక లేదా అని ప్రశ్నించారు. 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు పాలేరు కన్నా మిన్నగా సేవ చేస్తానని, భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇటీవల అకాల వరదలతో నియోజకవర్గంలోని చాలా గ్రామాలు తీవ్రంగా నష్టపోతే, వారిని పరామర్శించకపోగా, వారిని ఆదుకున్న పాపాన పోలేదని అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఓట్లను కొనుగోలు చేయడానికి వస్తున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ యాత్రలో భాగంగా వీరి వెంట కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి , వైయస్సార్ సిపి జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ ,రేగొండ మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య మరియు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రామ కమిటీ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.