తెలంగాణ పత్తి రైతుల సంఘం నూతనరాష్ట్ర కమిటీ ఎన్నిక
ఈ సదస్సు మాజీ శాసనసభ్యులు, ఆల్ ఇండియా కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి సమక్షంలో జరిగింది. అనేక రైతాంగ సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణ పై కూలంకషంగా చర్చించడం జరిగింది అనంతరం నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. సిసిఐ ద్వారా పత్తికొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. కాపాస్ కిసాన్ యాప్ అమలు వెనక్కి తీసుకోవాలి
రైతులు పండించిన పత్తి పంటను ఎక్కడైన స్వేచ్చగా విక్రయించే అవకాశం కల్పించాలి..
రైతులు పండించిన పత్తి మ్యాశ్చర్ తేమ తో సంబంధం లేకుండా సిసిఐ కొనుగోలు చేయాలి
పత్తి దిగుమతి పై ఉన్న 11 శాతం సుంకాన్ని కొనసాగించాలి. క్వింటాల్ పత్తికి రూ.10,075 ధర నిర్ణయించాలి.
పత్తి కొనుగోలు బాధ్యత నుండి తప్పుకోవడానికే ధరల వ్యత్యాస పథకం.
పత్తి క్వింటాల్‌కు రూ. 475, బోనస్ చెల్లించాలి.. .
ఉద్యమ కార్యాచరణ
1.రాష్ట్రవ్యాప్తంగా వర్షాలతో తడిసి ముద్దయిన పత్తి పంటలు – నష్టపరిహారం ఇవ్వాలని పంటల సందర్శన యాత్రలు
2.రాష్ట్రవ్యాప్తంగా సిసిఐ రీజినల్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నవంబర్ 10 న వరంగల్, నవంబర్ 17న ఆదిలాబాద్ , మహబూబ్ నగర్
నవంబర్ 10 నుండి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా కపాస్ కిసాన్ యాప్ అమలు వెనక్కి తీసుకోవాలని, యాప్ తో నిమిత్తం లేకుండా సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని, రైతుల పత్తిని తేమ క్వాలిటీ పేరుతో రిజెక్ట్ చేయకుండా కొనుగోలు చేయాలని సందర్శనలు
కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను సీసీఐని నీరు వారిచే ప్రయత్నాలను రైతాంగంలో ఎండగడితే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర కన్వీనర్ గా భూక్య చందు నాయక్
కో- కన్వీనర్లుగా. మూడ్ శోభన్ – రాష్ట్ర కేంద్రం, పుచ్చకాయల కృష్ణారెడ్డి- వరంగల్, చెల్పురి రాము -కరీంనగర్, బొబ్బ వెంకటరెడ్డి- మహబూబాబాద్ , జి.రామన్న- అదిలాబాద్ చిలుక బాల్ రెడ్డి – నాగర్ కర్నూల్ ,
వాసిరెడ్డి వరప్రసాద్- ఖమ్మం. SK సైదా – సూర్యాపేట