తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా
Hyderabadఈరోజు సికింద్రాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ వద్ద తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి సిఐటియు. మహిళా సంఘం, కెవిపిఎస్, వృత్తి, సంఘాలు ,ప్రజానాట్యమండలి , డివైఎఫ్ఐ తదితర సంఘాల నాయకులు హాజరైనారు ధర్నాను ఉద్దేశించి వృత్తి సంఘాల గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కన్వీనర్ గుమ్మడి రాజ నరేష్ * ధర్నా నిర్దేశించి ప్రసంగించారు వారు మాట్లాడుతూ 1) 58 జిఓ కింద దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి రెగ్యులర్ చేయాలని ,,2 )గతంలో డబుల్ ఇండ్ల కోసం దర్గా చేసుకున్న వారికి డబుల్ ఇండ్లను వెంటనే అలాట్మెంట్ చేయాలని,3) గృహలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయాలని,4) బిసి కులవృత్తిదారులకు దరఖాస్తు చేసుకున్న కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని, వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మహిళా సంఘం నగర్ కార్యదర్శి k.నాగలక్ష్మి సిఐటియు నగర నాయకులు కే రాజన్న .ఎం సత్యనారాయణ.పి మల్లేష్. KVPS నగర నాయకులు యాదగిరి, బిక్షపతి. రజక వృత్తిదారుల సంఘం నగర కార్యదర్శి ఏం గోపాల్ . రజక సంఘం నగర నాయకులు రాజు.ప్రజానాట్యమండలి నగర నాయకులు బిక్షపతి.రాజు వెంకన్న.సోమయ్య.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు . ధర్నా అనంతరం ఎమ్మార్వో శైలజ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది