
*ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు….
*పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసిన డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్యానాయక్
*బతుకమ్మ చీరలు, స్పోర్ట్స్ కిట్లను పంపిణి చేసిన ఎమ్మెల్యే
గళం న్యూస్ ( చిన్న గూడూర్) డోర్నకల్:-
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రతీ ఆడబిడ్డ ఆనందోత్సాహలతో జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వ కానుకగా ప్రతీ ఆడబిడ్డకు చీరలు పంపిణి చేస్తున్నట్లు డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు రెడ్యానాయక్ అన్నారు.ఉగ్గంపల్లి గ్రామంలో 8 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఉగ్గంపల్లి గ్రామ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు, యువతకి స్పోర్ట్స్ కిట్లను పంపిణి చేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే కి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని 18ఏళ్ళు నిండిన ఆడపడుచులందరికి చీరలు అందిస్తున్నదని తెలిపారు. గ్రామాలలోని యువతను క్రీడాల పట్ల ప్రోత్సహించాలని ప్రతీ గ్రామానికి స్పోర్ట్స్ కిట్లను అందిస్తున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారాయని అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే మార్గదర్శిగా సీఎం కేసీఆర్ నిలుపుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దండగలా ఉన్న వ్యవసాయాన్ని పండగలా మార్చిన మహనీయుడు సీఎం కేసీఆర్ గారని అన్నారు. రైతుబంధు, (భీమా), 24 గంటల కరెంట్, రైతు రుణమాఫీతో రైతులు ఆనందంగా రెండు పంటలు పండిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ గారు పథకాల రూపకల్పన చేయడమే కాకుండా అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాల అమలు చేస్తూ అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత జరిగిన అభివృద్ధి మన కళ్ళ ముందు కనిపిస్తోందని, పని చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాంసింగ్ నాయక్ గ్రామ సర్పంచ్ బీసు పూలమ్మ మల్లేశం ఎంపిటిసి భర్తపురం ఉదయమ్మ కోంరెల్లి ఎంపీపీ పద్మా వెంకట్ రెడ్డి,మాజీ కో ఆప్షన్ మెంబర్ అయూభ్ పాషా గ్రామ పార్టీ అధ్యక్షులు యాకి నాయక్ మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మంగపతి రావు, కో ఆప్షన్ మెంబర్ మోసిన్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సోమన్న , మాజీ సర్పంచ్ మంజుల మండల నాయకులు నూకల గంగరాజు , ముత్యం సత్యం,ముత్యం అంబరీష , మునిగేటి మల్లయ్య ఇస్మాయిల్ పాషా, యాకుబ్ రెడ్డి, యూత్ అధ్యక్షులు సాయి, కార్యకర్తలు, యూత్,ప్రజలు, అదికారులు తదితరులు పాల్గొన్నారు