
ఈ69న్యూస్ జఫర్ఘడ్
అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం వర్ధంతి జఫర్గడ్ మండల కమిటీ ఆధ్వర్యంలో జరపడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎండి షబానా ముఖ్యఅతిథిగా పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆనాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం వెట్టిచాకిరీ నశించాలి దున్నేవానికి భూమి కావాలని,నైజాం నవాబు గద్దె దిగాలనే నినాదాలతో సాగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో కీలక పాత్ర వహించారని అన్నారు.12 సంవత్సరాల వయసులోనే తుపాకీ చేత పట్టి నైజాం నవాబు రజాకార్లకు వ్యతిరేకంగా విరోచిత పోరాటం చేసిన వీర వనిత మల్లు స్వరాజ్యం అని అన్నారు.ఆ పోరాట ఫలితంగానే తెలంగాణలో నాలుగు వేల మంది వీరమరణం పొందారు.మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి.పది లక్షల ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేశారు.భూస్వాముల భూములు,గడీలు ప్రజల స్వాధీన మైనవి.వెట్టిచాకిరీ రద్దయింది.వ్యవసాయ కూలి రేట్లు పెంచబడ్డాయని అన్నారు.అణగారిన వర్గాల హక్కుల గొంతుకగా నిలిచారు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు శోభ కవిత కోమల భారత లక్ష్మి రజిత సునీత తదితరులు పాల్గొన్నారు.