తెలంగాణ రైతు సంఘం రెండవ రాష్ట్ర మహాసభలు నలగొండ పట్టణంలోని ఏచూరి గార్డెన్స్ లో ఈనెల 27 నుండి 29 వరకు జరుగుతున్నాయి ఈ మహాసభలకు జనగామ జిల్లా నుండి రాష్ట్ర సహాయ కార్యదర్శిని కనకారెడ్డి జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ వివిధ మండలాల నుండి రైతు సంఘం ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా మహాసభలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి బ్యాంకు రుణాలు రైతుబంధు రైతు బీమా అమలు చేయాలని కల్తీ విత్తనాలు అరికట్టాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం కనీసం మద్దతు ధర 3000 ఇవ్వాలని విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని మద్దతు ధరల చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం పాలు పాల ఉత్పత్తులపై విధించిన జీఎస్టీ ని ఎత్తివేయాలని డ్రిప్పు సిస్టంపై కేంద్ర ప్రభుత్వం విధించిన జిఎస్టి ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మహాసభల్లో తీర్మానించడం జరిగింది వీటి ఆధారంగా భవిష్యత్తులో జిల్లాలో పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలియజేయడం జరుగుతుంది