తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కమీషనర్ మరియు సంచాలకులు, కార్యాలయములోని పీ.ఎస్ మునవర్ అలీ గారికి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ అధ్వర్యంలో మే 20,న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా సమ్మె నోటీసును ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎలమోని స్వప్న మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు కోడి గ్రుడ్ల బిల్లులు గత ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్నాయని మరియు మూడు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు,వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, పద్మా,, వెలిశాల క్రిష్ణమాచారి పాల్గొన్నారు.