తెలంగాణ సాయుధ పోరాట వారుసులు కమ్యూనిస్టులే
వెట్టి చాకిరీ వ్యతిరేకంగా,దున్నేవారికే భూమి కోసం సాగిన వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన ఘన చరిత్ర కమునిస్తులదని, దీనీకి మతరంగు వేయడానికి బీజేపీ చేసే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్ట్) రాష్ట్ర కార్యదర్షివర్గ సభ్యులు ఎం. డి. అబ్బాస్ పిలుపునిచ్చారు. నేడు సీపీఎం హైదరబాద్ సౌత్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్స వాల సందర్భాన్ని పురస్కరించుకొని శాలిబండ నుండి చార్మినార్ వరకు బారీ ర్యాలీ జరిగింది.అనంతరం చార్మినార్ వద్ధ జరిగిన బహిరంగ సభకు ఆయన ముఖ్య వక్త గా హాజరై మాట్లాడారు.1946-51 మధ్య సాగిన వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రపంచ స్థాయి పోరాటాలలో ఒకటిగా గుర్తింపు వచ్చిందని చెప్పారు.హిందూ భూస్వాములు ముస్లిం రజాకార్లు ఒక్కటై పేద రైతుల్ని చిత్రహింసలు పెడ్తుండగా అన్ని కులాల,మతాల ప్రజల్ని సాయుదులు గా తీర్చిదిద్ది కమ్యూనిస్టులు జరిపిన పోరాటం వల్ల 10లక్షల ఎకరాల భూములు పేదలు స్వాధీనం చేసుకోగలిగారు. ఈ సుదీర్ఘ పోరాటం లో 4 వేల మంది ప్రాణాలు త్యాగం చేశారని గుర్తుచేశారు. 10వేల గ్రామాలు విముక్తి అయ్యాయని పేర్కొన్నారు.
ఆనాటి పోరాట ఘటనలకు,బీజేపీ,ఎం ఐ ఎం లు మతం రంగు వేయాలని చూస్తున్నాయని, వాటిని ఆపేసి, పాత బస్తీలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం,ఈ ప్రాంత ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం పై శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. ఇక్కడి ప్రజల సమస్యల పష్కారానికి సీపీఎం శక్తి మేరకు పోరాడుతున్న దనీ చెప్పారు. దీనిలో సీపీఎం సౌత్ జిల్లా నాయకులు ఎం. మీన, జీ.విఠల్,పి .నాగేశ్వర్,అబ్దుల్ సత్తార్,ఎం.లక్ష్మమ్మ,శ్రావణ్ కుమార్,ఎం.బాలు నాయక్, ఏ.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.