
ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్ లో పనిచేయు కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు నెలకు 8700 ఇస్తున్నారు. ధరలు పెరిగి పిల్లల ఫీజులు ,ఇండ్ల కిరాయిలు తట్టుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులకు జీవో 60 ప్రకారం 15,600 ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి పోస్ట్ కార్డు ద్వారా లెటర్ల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్ మాట్లాడుతూ హైదరాబాదులోని ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్ లో టీబీ ,చెస్ట్, కరోనా రోగులకు సేవలందించేటువంటి కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం పెంచకపోవడం దారుణమని వెంటనే జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖల ద్వారా తెలియజేయడం జరిగింది లేనియెడల డీఎంఏ ఆఫీస్ ,ప్రగతి భవన్లు ముట్టడి చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్ శ్రీనివాస్ ,విటల్, సంధ్య ,అమృత ,పద్మ, కె యాదగిరి ,విట్టల్ ,యాదయ్య తదితరులు పాల్గొన్నారు.