
A young man named Pasula Raju from Peddampalle village, Regonda mandal, Jayashankar Bhupalapalli district has been selected for the Telangana state level cricket team. Raju, who was poor, was fond of cricket from his childhood and worked hard to become a cricketer.
E69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పెద్దంపల్లె గ్రామానికి చెందిన పసుల రాజు అనే యువకుడు తెలంగాణ స్టేట్ లెవెల్ క్రికెట్ జట్టుకు ఎంపికైయ్యాడు.నిరుపేద అయిన రాజు తన చిన్నతనం నుండి క్రికెట్ పై ఇష్టంతో అహర్నిశలు కష్టపడి ఈ స్తాయికి ఏదిగాడు.భువనేశ్వర్ లో అక్టోబర్ 1 నుండి జరిగే క్రికెట్ టోర్నమెంట్లో పసుల రాజు పాల్గొననున్నారు. రాజు ఈ విధంగా తెలంగాణ క్రికెట్ టీం కు ఎంపిక అవ్వడం పట్ల పెద్దంపల్లె గ్రామ ప్రజలతో పాటు, రేగొండ మండల ప్రజలు రాజును అభినందించారు.తెలంగాణ రాష్టం తరుపున క్రికెట్ ఆడడం తనకు సంతోషంగా ఉందని రాజు అన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజును దాతలు అదుకొని, అతనికి ఆర్థికంగా సహాయం చేసి అతని జీవితంలో వెలుగులు నింపాలని, తద్వారా అతను తన ప్రతిభను మెరుగు పర్చుకొని భారత క్రికెట్ జట్టుకు సెలెక్ట్ అయి, దాతల పేరు నిలపడేలా చేస్తాడని పెద్దంపల్లె గ్రామస్తులు తెలిపారు.