
తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా పల్లె నాగేశ్వరరావు నూతనంగా ఎన్నిక కావడంతో.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు, ఆయనది స్వస్థలం కోదాడ మండలం తొగర్రాయి గ్రామం కావడంతో కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పల్లె నాగేశ్వరరావు మిత్ర మండలి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు కోదాడ న్యాయవాదులు , జర్నలిస్టులు , వివిధ ప్రజా సంఘాల నాయకులు,వ్యాపార వేత్తలు పాల్గొని మున్సిపాలిటీ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పబ్లిక్ క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు, అనంతరం కోదాడ పట్టణంలో ఉన్న పబ్లిక్ క్లబ్ నందు ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, చదువు ఉంటేనే ప్రతి ఒక్కరూ ఉన్నతస్థాయికి చేరుకుంటారని అన్నారు, అలాగే నేను ఈ స్థాయికి రావడానికి నాకు చదువు ఎంతగానో ఉపయోగపడిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు, నా మీద ఉన్న అభిమానంతో నాకు ఘన సన్మానం నిర్వహించిన కోదాడ ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు.
బైట్.