తొర్రూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో చెర్లపాలెం,కంఠాయపాలెం గ్రామాల్లో గ్రామీణ రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రణాళికలో భాగంగా పిఎంజిఎస్వై పథకం కింద ఆమోదమైన వంతెన నిర్మాణా పనులకు స్థానిక శాసన సభ్యురాలు యశస్విని రెడ్డితో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరై వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు.ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ..ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఆధ్వర్యం లోని ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ,అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.మా అమ్మమ్మగారి ఊరు కంఠాయపాలెం రావడం మీ అందరిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఎంపీగా ఇక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం నా అదృష్టంగా భావిస్తునాని అన్నారు.గత బిఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయని విమర్శించారు.కాంగ్రెస్ ప్రజా పాలనలో ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.వరంగల్ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు.పాలకుర్తి నియోజకవర్గం ఇప్పుడు ఒక తల్లి ఒడిలో ఉన్నట్టు సురక్షితంగా ఉందన్నారు.నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే యశస్విని అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఒక్కో కార్యకర్త ఒక్కో సైనికులు గా పని చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి,ప్రజాప్రతినిధులు,అధికారులు,నియోజకవర్గ నాయకులు,యువజన నాయకులు,మహిళ నాయకులు,పార్టీ శ్రేణులు,తదితరులు,పాల్గొన్నారు