
బక్రీద్ పర్వదినం త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం బక్రీద్ పర్వదినం సందర్భంగా కోదాడ పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……. ఆకలితో ఉన్న పేద వాళ్లకు కడుపు నింపాలని మనకున్న సంపదలో ఎంతో కొంత దానం చేయాలని బక్రీద్ పండుగ ఉద్దేశం అన్నారు. నేటి త్యాగాలతోనే భవిష్యత్ తరాలకు సంక్షేమం కలుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని కులాల మతాల వారి పండుగలో భాగస్వామ్యమై పండుగల ప్రాధాన్యతను పెంచిందన్నారు. ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ముస్లింల పిల్లలు విద్యా పరంగా అభివృద్ధి చెందాలని మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి వసతితో కూడిన నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుంది అన్నారు. ముస్లిం ఆడపిల్లల వివాహానికి షాదీ ముబారక్ పేరుతో 1,16,000 కట్న కానుకలు అందించి సీఎం కేసీఆర్ మేనమామ గా అండగా నిలిచారన్నారు. శిథిలమైపోతున్న మసీదులు షాది ఖానాలు ఈద్గాలకు లక్షల రూపాయల బడ్జెట్ మంజూరు చేసి ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు. గత పాలకవర్గాలు ముస్లింలను ఓటు బ్యాంకు గానే వినియోగించుకున్నాయని తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలు భరోసాగా బతుకుతున్నారన్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేస్తూ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు అందరితోపాటు పెన్షన్లు రైతుబంధు రైతు బీమా పథకాలను వర్తింప చేస్తూ ముస్లింల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు ముస్లిం సోదరులందరూ బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవాలని అన్నారు.నియోజకవర్గ ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లింలను ఆలింగనం చేసుకొని సోదర భావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, పట్టణ కౌన్సిలర్లు, నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.