
దద్దరిల్లిన పామిడి పట్టణం గుమ్మనూరు జయరాం రోడ్ షో సూపర్ సక్సెస్
గుంతకల్లు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం మరియు ఆయన తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ పామిడి పట్టణంలో చేపట్టిన రోడ్ షో భారీ సక్సెస్ అయింది పామిడి పట్టణం స్థానిక విద్యా మందిరం నుండి అడుగడుగునా తెలుగుదేశం పార్టీ సోదరులు పామిడి మండలం మరియు పట్టణ తెలుగు పార్టీ కార్యకర్తలు నాయకులు జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అందరూ గుమ్మనూరు జయరాం మద్దతుగా భారీగా తరలివచ్చి రోడ్ షో ను ఇదివరకు ఎప్పుడూ కనివిని ఎరగని రీతిలో భారీ సక్సెస్ చేశారు. ఎద్దులపల్లి సర్కిల్ వద్ద గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ఇంతటి ఎండలో కూడా అడుగడుగునా తనకు మద్దతుగా నిలిచిన పామిడి పట్టణ మరియు మండల ప్రజలకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు,అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అలాగే స్థానికంగా ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీకు అండగా ఈ గుమ్మనూరు జయరాం ఉన్నారని ప్రజలందరికీ తెలియజేశారు కచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని, ఎన్డీఏ కూటమి విజయ అనంతరం గుంతకల్లు నియోజకవర్గం అభివృద్ధి చేసే బాధ్యతలుతీసుకుంటానని వచ్చే రోజుల్లో ఇసుక ఫ్రీగా ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.. ఎన్నికలకు రెండు రోజులు టైం ఉన్నందున ప్రజలందరూ కచ్చితంగా సైకిల్ గుర్తు పైన ఓటు వేసి ఎన్డీఏ కూటమిని ఆదరించాలని ఈ సందర్భంగా పామిడి పట్టణ మరియు మండల ప్రజలకు గుమ్మనూరు జయరాం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పామిడి మండల, పట్టణం ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.