సమాజంలో తరతరాలుగా వస్తున్న అంతరాలు తొలగిపోయి ఆర్థికంగా సామాజికంగా ప్రజలందరూ అభివృద్ధి చెందినప్పుడే ఈ సమాజం ముందుకు పోతుందని కెవిపిఎస్ దళిత గిరిజన చట్టాలతో డైరీ క్యాలెండర్ తీసుకరావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద kvps డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితుల సమగ్ర అభివృద్ధి కొరకు ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని దళిత బంధు ఒక వరమని అన్నారు. కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జునమాట్లాడుతూ ప్రపంచ చరిత్ర గతిని మార్చిన మార్క్స్ జీవిత లక్ష్యమైన దోపిడీ లేని సమాజాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని దుర్మార్గమైన కుల వ్యవస్థను రూపుమాపడానికి తమ సర్వస్వం త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మార్గదర్శకంలో సామాజిక ఉద్యమాలు ముందుకు సాగాలని అన్నారు. నేడు దేశంలో మనోభావాల పేరిట మనుషుల పైన జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు ప్రజల ప్రశాంతతను దెబ్బతీస్తాయని చెప్పారు. రెచ్చగొట్టడం విద్వేషాలు రగిలించడం ఎవరు చేసినా తప్పేనని ఆయన అన్నారు. సామాజిక ప్రజాస్వామిక హక్కులు అనేకం మన దేశ రాజ్యాంగం కల్పించిందని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు కెవిపిఎస్ జిల్లాలో అనేక సామాజిక ఉద్యమాలు నిర్మించి ఫలితాలు సాధించిన సంస్థగా నిలిచిందన్నారు. ఒక గొప్ప సిద్ధాంతం స్పష్టమైన కార్యాచరణతో కెవిపిఎస్ అనేక విజయాల సాధించిందన్నారు. సామాజిక అనిచివేతకు ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా కెవిపిఎస్ నిర్మించే అన్ని పోరాటాలలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై దాడులు జరిగితే ఉద్యమిస్తున్నటువంటి యువతరం నేడు మనువాదం ద్వారా మన రాజ్యాంగానికి పొంచి ఉన్న ప్రమాదం పైన సంఘటిత ప్రతిఘటన ఉద్యమాలు నిర్మించాలన్నారు. గత 15 ఏళ్లుగా కెవిపిఎస్ ముద్రిస్తున్న డైరీ మహనీయుల జీవిత చరిత్రలతో పాటు అనేక చట్టాలు జీవోలు పొందుపరచడం జరిగిందన్నారు డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస నాయక్ జిల్లా డిఎం అండ్ హెచ్ ఓ అనిమల్లా కొండలరావు ఎస్టీ కార్పొరేషన్ డిడి రాజకుమార్ ఎస్సీ వెల్ఫేర్ సీనియర్ అసిస్టెంట్ జయపాల్ ఎస్సీ కార్పొరేషన్ సూపరిండెంట్ రాజు కే విపిఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరిషరాములు కోడిరెక్క రాధిక జిల్లా ఆఫీసు బేరర్స్ గాదే నరసింహ బొల్లు రవీందర్ పెరికే విజయకుమార్ కోడి రెక్క మల్లన్న జిల్లా కమిటీ సభ్యులు ఒంటెపాక కృష్ణ చిలుముల రామస్వామి దండూ రవి తేలగమల్ల మాధవి దేవరకొండ వెంకటయ్య మల్లెపల్లి కృష్ణ బొల్లంపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.పాలడుగు నాగార్జున జిల్లా ప్రధాన కార్యదర్శి