bhadradri kothagudem news
సేవా కార్యక్రమాలలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలి: ప్రిన్సిపల్ కృష్ణవేణి
దుమ్మగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు గురువారం నాడు ఎన్ఎస్ఎస్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి సిహెచ్ కృష్ణవేణి మాట్లాడుతూ విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ సేవా కార్యక్రమాలు లో చురుకుగా పాల్గొనాలని, మీ ఇంటి చుట్టు శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలని, వరదలు వచ్చినప్పుడు మరియు జాతర్లయందు సహాయ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని తెలియజేశారు. విద్యార్థుల సేవా భావం పెరగాలని అది సమాజాశ్రేయస్సుకు ఉపయోగ పడుతుంది ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అజ్ఞాపకులు కే పి డి వర రాజు, బోటనీ అధ్యాపకులు పవన్ కుమార్ విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ సేవా కార్యకమాలు గురించి పలు సూచనలు చేసినారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మల్లెల శ్రీనివాసరావు విద్యార్థులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.