
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని తాటికొండ గ్రామంలో గల కనకదుర్గా దేవి ఆలయంలో సోమవారం రోజు నుంచి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.మొదటి రోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా పంచామృత అభిషేకం,నిత్య హోమం,పూర్ణాహుతి,కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు అర్చకుడు జీడికంటి వరుణాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు.అనంతరం తీర్థప్రసాద వితరణ జరిగింది.ఉత్సవాల సందర్భంగా కొంతమంది భక్తులు దీక్ష తీసుకోగా,వారికి అర్చకులు మాలా ధరింపజేశారు.ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో అర్చకుడు జీడికంటి వరుణాచార్యులు,భవాని మాల దీక్ష తీసుకున్న సభ్యులు పండుగ రాజేశ్వర్,పండుగ కనకయ్య,పర్శ రాజు,పండుగ రవి,పండుగ సత్తయ్య,పండుగ గణేష్,కుంట రమేష్,శ్రీపతి రాజు,మారపాక నాగరాజుతో పాటు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చొక్కం రాములు,భక్తులు పండుగ బుచ్చయ్య,నారబోయిన గోపాల్,చల్ల విజేందర్ రెడ్డి,పండుగ రాజేందర్,వీరస్వామి,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు