
బి ఎస్ ఎఫ్ ఐ నియోజకవర్గం అధ్యక్షులు కత్తి నాగబాబు
బి ఎస్ ఎఫ్ ఐ నియోజకవర్గం అధ్యక్షులు కత్తి నాగబాబు
మునగాల తెలుగు గళం న్యూస్ ఫిబ్రవరి11
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బి ఎస్ ఎఫ్ ఐ నియోజకవర్గం అద్యక్షులు కత్తి నాగబాబు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ… రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను క్రింద కూర్చో బెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సతీమణిని పైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను క్రింద కూర్చోబెట్టారన్నారు. దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి ఎక్కడ చెప్పుకోవాలి?… ఎవరికి చెప్పుకోవాలి? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైనా భట్టి విక్రమార్కనే అవమానించారన్నారు.74 యేండ్ల స్వాతంత్ర భారతంలో దళితులకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతుందన్నారు. యావత్ దళిత జాతిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి భట్టి విక్రమార్క ఫోటో పక్కన పెడుతున్నారని…. ప్రభుత్వ యాడ్స్‌లో డిప్యూటీ సీఎం ఫోటోను పక్కన పెట్టారన్నారు.జరిగిన ఘటనపై నయా దేశ్ ముఖ్ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంపై కాంగ్రెస్ పార్టీ హైకామండ్ స్పందించాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని కత్తి నాగబాబు డిమాండ్ చేశారు