
25.12.2022**** **వికలాంగులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం.****నూతన విద్యా విధానంతో వికలాంగులను విద్యకు దూరం చేసే కుట్ర.****డిసెంబర్ 26న భారీ బహిరంగసభ.** —————————–(ఎన్పిఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ పిలుపు.)నూతన విద్యా విధానం రద్దు చేయాలని, దేశా వ్యాపితంగా వికలాంగులకు ఒకే పెన్షన్ విధానం ఉండాలని, వికలాంగులకు స్థానిక, చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్లు, బడ్జెట్ లో 5 శాతం వాటా, ప్రత్యేక అట్రాసిటీ ఆక్ట్ సాధన కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ఎన్పిఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ హెచ్చరించారు.దివి: 25-12-2022 ఆదివారం రోజున జనగామ పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఎన్పిఆర్డీ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు అధ్యక్షతన ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ పాల్గొని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ సంఘం జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ డిసెంబర్ 26 -28 తేదీల్లో హైదరాబాద్ నగరంలో సంఘం అఖిలభారత మూడవ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని అన్నారు. గడిచిన 8 ఏళ్ల కాలంలో కేంద్రంలో అధికారం ఉన్న బిజెపి ప్రభుత్వం వికలాంగుల హక్కులపై దాడి చేస్తుందని, వికలాంగుల చట్టాలను ఎందుకు మార్చుతుందని ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు మొండి చెయ్యి చూపిస్తుందని విమర్శించారు. 2020-22 ఆర్థిక సంవత్సరాలలో కేవలం 0.0084 శాతం నిధులను కేటాయించి వికలాంగుల మోసం చేసిందని విమర్శించారు. వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని గొప్పగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో 35 శాతం నిధులు కూడా ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. యాక్సిసబుల్ ఇండియా సుగంధ భారత్ అభియాన్, దివ్యాంగ్ వంటి పేర్లతో వికలాంగుల మోసం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం వికలాంగుల విద్యకు దూరం చేసేదిగా ఉందని దీని రద్దు కోసం దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించడంలో వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 300 రూపాయల పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. జీవిత అవసరాలకు అనుగుణంగా పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. నూతన ఆర్థిక విధానాల అమలు తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరం అవుతున్నాయని, ప్రైవేట్ రంగంలో సైతం వికలాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా వికలాంగులపై లైంగిక వేధింపులు అత్యాచారాలు పెరిగిపోతున్న వాటిని అరికట్టడం లేదని విమర్శించారు. ఈ మహాసభల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు చర్చించి భవిష్యత్తు పోరాటాలను రూపకల్పన చేస్తామని తెలిపారు. మహాసభల సందర్భంగా **డిసెంబర్ 26 నాడు ఇందిర పార్క్ దగ్గర బహిరంగ సభ** నిర్వహిస్తున్నామని ఈ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు పెద్ద ఎత్తున కదలిరావాలని పిలుపునిచ్చారు. **ఈ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా కేరళ మాజీ విద్యాశాఖ మంత్రి క్రాంతి గంగూలీ** హాజరవుతున్నారని అన్నారు. **డిసెంబర్ 27న వికలాంగుల సంక్షేమం, విద్య, ఉద్యోగం, ఉపాధి, సాధికారతపై జాతీయ సదస్సు* నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు **ముఖ్య అతిథులుగా ఎన్పిఆర్డీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ మరియు వికలాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కేరళ రాష్ట్ర సోషల్ జస్టిస్ మినిస్టర్ డాక్టర్ ఆర్. బిందు, తెలంగాణ వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే. వాసుదేవ రెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్** ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తోట సురేందర్, జిల్లా ఉపాధ్యక్షులు మామిడాల రాజేశ్వరి, పిట్టల కుమార్, సహాయ కార్యదర్శులు బండవరం శ్రీదేవి, కొత్తపల్లి రమేష్, కోశాధికారులు ఇట్టబోయిన మధు, నామాల రాజు, కమిటీ సభ్యులు మోతె వెంకటమ్మ, స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షులు ఎడ్ల రమాదేవి, కార్యదర్శి ఆకారపు కుమార్, పులిగిల్ల రాజయ్య, రడపాక యాదగిరి, మాలోతు రాజ్ కుమార్, పులి మంజుల, బైరగోని మహేష్, గొడుగు రాజవ్వ, తాడెం రాములు, బండ్రు శ్రీశైలం, కామరాతి వినయ్ తదితరులు పాల్గొన్నారు.