
దేశానికే ఆదర్శం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం
పేదల ఆత్మగౌరవంతో జీవించేందుకు నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లో నిర్మించిన 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వారు పరిశీలించారు. అనంతరం రెండున్నర కోట్ల రూపాయలతో జరుగుతున్న డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు, మౌలిక వసతుల పనులను పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచి లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా నాణ్యతతో నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అత్యంత పారదర్శకంగా అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గౌరవ ఎమ్మెల్యే కేటాయించారని అన్నారు. అతి త్వరలోనే ఎమ్మెల్యేతో లబ్ధిదారులు అందరిచే గృహప్రవేశాలు చేయడం జరుగుతుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో పేదల సొంతింటి కల సహకారమైందని ఇల్లు రానివారు నిరుత్సాహపడకుండా అందరికీ త్వరలోనే మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంపటి పద్మా మధుసూదన్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు డిఇ సతీష్ బాబు, కౌన్సిలర్లు కోట మధు, స్వామి నాయక్, కల్లూరి పద్మజ, కందుల చంద్రశేఖర్, మదర్, ఖదీర్ పాషా, గుండెల సూర్యనారాయణ, కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస్, వంటి పులి రమా శ్రీనివాస్,అలవాల అపర్ణ వెంకట్, డాక్టర్ బ్రహ్మం,వంశీ నాని,అబిధర్ నాయుడు ఏఇ రామ్ తదితరులు పాల్గొన్నారు.