దేశ ప్రజలు కమ్యూనిస్టు పార్టీ వైపు చూస్తున్నారు
Uncategorized
ఈ69న్యూస్ లింగాల గణపురం
దేశంలో కమ్యూనిస్టులు పెరుగుతేనే ప్రజలకు రక్షణ ఉంటుందని సిపిఐ పార్టీ లింగాల గణపురం మండల కార్యదర్శి రావుల సదానందం అన్నారు.జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని వడిచర్ల గ్రామంలో గురివెందుల వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి రావుల సదానందం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.దేశ స్వాతంత్ర్యాన్ని సాధించడంలో కమ్యూనిస్టులు వీరోచిత పోరాటాలు చేసి ఎంతో మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని అన్నారు.దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగ రక్షణ సాధనకు కృషి చేసేది కమ్యూనిస్టులేనని అన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర కమ్యూనిస్టు పార్టీలదే నని అన్నారు.అందుకే యువత,మహిళలు,కార్మికులు,శ్రామికులు కమ్యూనిస్టు పార్టీ వైపు చూస్తున్నారన్నారు.ప్రజల సమస్యలపై పోరాటం చేయడానికి కమ్యూనిస్టు పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారన్నారు.పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్పా అని ఆయన పేర్కొన్నారు.సమావేశంలో గ్రామ శాఖ జనరల్ సెక్రటరీగా సానిక వీరస్వామి జాయింట్ సెక్రటరీగా సానిక ఉపేందర్ లను నియమించారు.ఈ సమావేశంలో కొలిపాక రవి గండి ఉపేందర్ జోగు పరుశురాములు రేగు శ్రీశైలం కేమిడి నర్సయ్య సానిక మల్లేశం వట్టిపల్లి వెంకటేష్ కెమిడీ యాదగిరి కొంగరి నరేష్ నోముల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.