దొంగే దొంగా అన్న చందంగా కేటీఆర్,హరీష్ రావు ల విమర్షలు తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి
Hyderabadహైదరాబాద్:
గత పది సంవత్సరాల బిఆర్ఎస్ కేసీఆర్ పరిపాలనలో రైతులకు పంట నష్టపరిహారం కానీ,దాన్యం కోనుగోలు కేంద్రాలు,అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన దానిపై నేడు మోసలి కన్నీరు కారుస్తున్న కేటీఆర్,హరీష్ రావులు నాడు స్పందించారా..? అని తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి విమర్శించారు.
గురువారం చైర్మన్ జంగా రాఘవ రెడ్డి తన కార్యాలయంలో మీడితో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వం మీది కాదా..? ఎందరు ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా రికార్డు కూడా లేకుండా చేసిన పాపం మీది కాదా.? అని స్టేట్ ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి ప్రశ్నించారు.
కనీసం పంట నష్టపరిహారం ఇచ్చిన ఘటనలు మీపాలనలో ఉన్నాయా అని ఒకసారి చూసుకోవాలని హితవు పలికారు.
రైతులపై మోసలి కన్నీరు కారుస్తున్న మీ డ్రామాలను రైతులు అర్ధం చేసుకున్నారు కనుకనే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుండు సున్నా ఇచ్చిన సంగతి మరవవద్దని జంగా రాఘవ రెడ్డి ఎద్దేవా చేసారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదుల కింద ప్రాజెక్ట్ కింద పంటలుచేతికందేవరకు సాగునీటి ని అందించేందుకు, ఇపుడు వేసిన పంటలను నష్టపోకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్న దేవాదుల నీళ్లు అందించేందుకు రాష్ట్ర సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ చేసి దేవన్న పేట పంప్ హౌస్ లో ఉన్న 800 క్యూసెక్కుల నీటిని సరఫర చేసే పంప్ ను స్విచ్చాన్ ఆన్ చేస్తే బిఆర్ఎస్ నేతలకు కన్నులు మండుతున్నాయని ఓర్చోకోలేకపోతు పస లేని విమర్శలు చేస్తున్నారని ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా మండి పడ్డారు.
జనగామ,స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలలోని చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ చార్జి మంత్రి పొంగిలెటి శ్రీనివస్ రెడ్డి చొరవ చేస్తే రైతుల్లో ప్రభుత్వం కు మంచి పేరు వస్తుంటే అక్కసుతో నీతి మాలిన విమర్షలు చేస్తున్నారని..
రైతు ప్రభుత్వం అయిన ఇందిరమ్మ రాజ్యం పై మాట్లాడే నైతిక అర్హత కెటిఆర్, హరిష్ రావులకు లేదని జంగ రాఘవ రెడ్డి పెర్కొన్నారు…