ఈ69న్యూస్ మహబూబ్ నగర్ ఆగస్టు 31 మహబూబ్నగర్ జిల్లా ధర్మపుర్ గ్రామంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.నాగరాజు,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.రాజు ఆధ్వర్యంలో ఆదివారం చాకలి ఐలమ్మ విగ్రహా భూమిపూజ ఘనంగా జరిగింది.గ్రామ అధ్యక్షులు జంగయ్య భూమిపూజ నిర్వహించగా,ముఖ్య అతిథులుగా మాజీ ఎంపిటీసీలు రవీందర్ రెడ్డి,మేఘారెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ,గోపి రజక,పండుగల సాయన్న తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేతూరి శివన్న మాట్లాడుతూ..“దొరలపై,రజాకార్లపై పోరాటం చేసి,లక్షల ఎకరాల భూమిని పీడిత ప్రజలకు పంచి పెట్టిన మహనీయురాలు చాకలి ఐలమ్మ.ఆ తల్లిని తెలంగాణ తల్లిగా ప్రకటించాలని ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాము”అని అన్నారు.కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి,జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్,ఉద్యోగుల సంఘం నాయకులు సతీష్ కుమార్,నరేష్,పట్టణ గౌరవ అధ్యక్షులు యాదేశ్ కుమార్,ప్రధాన కార్యదర్శి మైబు,గ్రామ రజక సంఘం నాయకులు రమేష్,శ్రీనివాస్,రాంపూర్ యాదయ్య,ఆంజనేయులు,రాఘవేంద్ర,తుపాకుల చంద్రుడు,విజయ్ గౌడ్ (టీఆర్ఎస్ మండల నాయకుడు),ఆలూరి ఆంజనేయులు,పోలిస్ కుమార్,మల్లేష్ మేస్త్రి,బుచ్చన్న,బోల యాదయ్య,పోలీస్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.