
దేవరుప్పుల మండలం ధర్మపుర0 గ్రామంలో ఐకెపి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ మన రాష్ట్రంలోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఆఖరి గింజ వరకు ధాన్యం కొంటామని, రైతులు, బాగా ఆరబోసి, నిర్ణీత ప్రమాణాలు పాటిస్తూ, కొనుగోలు కేంద్రాలను ధాన్యం తేవాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.