ఈ69న్యూస్:హనుమకొండ జిల్లా అయినవోలు మండలం నందనం గ్రామానికి చెందిన యాకర మల్లమ్మ అనే వృద్దురాలు 30-04-2025 రోజున తీవ్ర ఎండకు గురై వడదెబ్బతో మృతి చెందింది.ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది.మల్లమ్మ మృతి కారణంగా కుటుంబం ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతుండడంతో,బంధువులు ప్రభుత్వం తక్షణం స్పందించి ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.