
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని పరామర్శించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారి తల్లి దొంతి కాంతమ్మ మృతి చెందిగా ఆదివారం హనుమకొండ లోని ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి నివాసానికి సీఎం సలహాదారు వేం.నరేందర్ రెడ్డి,పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,నాయిని రాజేందర్ రెడ్డి,గండ్ర సత్యనారాయణ రావు,కె ఆర్ నాగరాజు గార్లతో కలిసి దొంతి కాంతమ్మ భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ – వరద రాజేశ్వర్ రావు, టిపిసిసి జనరల్ సెక్రటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.