
కంజ్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధికార ప్రతినిధి పేరూరు బాలకృష్ణ
అనంతపూర్ నగరంలోని నలందా జూనియర్ కళాశాల ను కంజ్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధికార ప్రతినిధి పేరూరు బాలకృష్ణ సోమవారం నాడు సందర్శించారు. రాయలసీమ ప్రాంత పర్యటనలో భాగంగా వెనుకబడిన జిల్లా ఐన అనంతపూర్ లో పర్యటించారు. గత రెండు దశాబ్దాలుగా జిల్లాలో ఇంటర్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న నలందా జూనియర్ కళాశాల ను ఆయన సందర్శించారు…. ఈ సంధర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఖాజీ బాబు , కోఆర్డినేటర్ రాంబాబు పుష్ప గుచ్చం అందజేసి అభినందనలు తేలిపారు. 2024-25 సంత్సరానికి గాను కళాశాల విద్యార్థులు సాధించిన విజయం గురించి ప్రిన్సిపాల్ ఖాజి బాబు వివరించారు …సీనియర్ ఇంటర్ లోఅత్యధికంగా హర్షిత చౌదరి, గగన శ్రీ అనే విద్యార్థిని 1000 మార్కులకు గాను 985 మార్కులు సాధించిందని అలాగే.. జూనియర్ ఇంటర్ లో శ్రీ కనిష్క అనే విద్యార్థి 470 మార్కులకు గాను 465 మార్కులు సాదించిందని వివరించారు. కళాశాల విద్యార్థులు సాధించిన విజయాలకు పేరూరు బాలకృష్ణ… ప్రిన్సిపాల్ మరియు సిబ్బందికి అభినందనలు తెలిపారు.